: భద్రాచలం సీమాంధ్రలోకి వెళ్లే ప్రసక్తే లేదు: రేణుకా చౌదరి


తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న భద్రాచలం ఈ ప్రాంతం నుంచి విడిపోకుండా తన వంతు కృషి చేస్తామని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఉస్మానియా విద్యార్థి జేఏసీకి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతలు వినతి పత్రం అందజేశారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం అని నినాదాలు చేసిన విద్యార్థులు, తెలంగాణకు ద్రోహం చేస్తున్న వారిపై భౌతిక దాడులకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. భద్రాచలం దేవస్థానంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రేణుకాచౌదరి, అది సీమాంధ్రలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంలోని పెద్దలతో తాను ఫోన్లో మాట్లాడానని ఆమె వివరించారు. పోలవం ప్రాజెక్టు నిర్మాణానికి, దాని జాతీయ హోదాకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చూడాలో ఆలోచిస్తామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News