: కేజ్రీవాల్ కు పరాభవం.. ఇంకు చల్లిన అన్నా మద్దతుదారుడు
ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగా... బీజేపీ కార్యకర్త, అన్నా హజారే మద్దతుదారుడైన ఓ యువకుడు కేజ్రీవాల్ పై ఇంకు చల్లాడు. అన్నా హజారే పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ పై నిరసన వ్యక్తం చేశాడు. తాను మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. దీంతో అన్నా హజారే, కేజ్రీవాల్ మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నాతో కలసి పని చేసినప్పుడు... ప్రజలనుంచి పొందిన విరాళాలను ఈ ఎన్నికల కోసం దుర్వినియోగం చేయలేదంటూ కేజ్రీవాల్ వివరణ ఇస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.