: కేంద్రం వెనకడుగు వేస్తే సీఎందే బాధ్యత: కేటీఆర్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎంకు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని కేంద్రం వెనక్కి వెళితే... జరిగే పరిణామాలకు సీఎందే భాధ్యత అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అరకొర జ్ఞానంతో జీవోఎంకు నివేదిక ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి జీవోఎంకు ఇచ్చిన నివేదికపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. భారత్, పాక్ లు 5 నదుల నీటిని పంచుకుంటుంటే లేనిది... పొరుగు రాష్ట్రాలతో నీటి యుద్ధాలెలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News