: కోల్ కతా వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోల్ కతా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం పశ్చిమ బెంగాల్ వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవాలని జగన్ సీబీఐ కోర్టుకు తెలిపారు. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.