: పాక్ ప్రధానికి ఖుర్షీద్ ఆతిధ్యం
భారతదేశంలో పర్యటించనున్న పాకిస్తాన్ ప్రధాని రాజా పర్వేజ్ ఆష్రాఫ్ కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆతిధ్యం ఇవ్వనున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా పర్వేజ్ శనివారం జైపూర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా పర్వేజ్ కోసం జైపూర్లోని రామ్ బాగ్ ప్యాలస్ హోటల్లో ఖుర్షీద్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా చెప్పుకోదగ్గ చర్చలు ఉండకపోవచ్చునని సమాచారం.