: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కరస్పాండెంట్ వేధింపుల పర్వం
తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆ పాఠశాల కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సైదాబాద్ లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి... స్కూల్ కరస్పాండెంట్ తనను రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, పాఠశాల వద్దకు ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.