: విభజనతో తెలంగాణ తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటుంది : సీఎం కిరణ్


రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటుందని సీఎం కిరణ్ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగంలో కేవలం 50 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని... మిగతా 50 శాతం సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో 175 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుందని... దీనికోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News