: రాష్ట్రాలు మారడం వల్ల ఉద్యోగులు సీనియారిటీ కోల్పోతారు: ముఖ్యమంత్రి కిరణ్


జీవోఎంతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు రాష్ట్రాలు మారడం వల్ల సీనియారిటీ కోల్పోతారని కిరణ్ చెప్పారు. జోనల్ విధానంలో ఉన్న 2 లక్షల మంది ఉద్యోగులకు రాష్ట్ర విభజన శరాఘాతంగా మారుతుందని జీవోఎంకు చెప్పినట్టు కిరణ్ తెలిపారు. దీంతో, ఎంతో మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. వీరందరికీ న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు. వేలాది మంది ఉద్యోగుల పిటిషన్లు కూడా ఇబ్బందుల్లో పడతాయని తెలిపారు.

ఉన్నత విద్యా రంగమంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని సీఎం తెలిపారు. సీమాంధ్ర నుంచి 25 శాతం మంది విద్య కోసం తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారని శ్రీకృష్ణ కమిటీ తెలిపిందని చెప్పారు. ప్రైవేటు, ఐటీ ఉద్యోగాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలో పడుతుందని కిరణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News