: ఐటీ, ఫార్మా కంపెనీలు 80 శాతం తెలంగాణలోనే ఉన్నాయి : సీఎం కిరణ్
జీవోఎంతో సమావేశం అనంతరం సీఎం కిరణ్ ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఫార్మా, సాఫ్ట్ వేర్ కంపెనీలలో 80 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే పారిశ్రామిక, ప్రైవేటు ఉద్యోగాల పంపిణీ విషయంలో కూడా తీవ్ర సమస్యలు తలెత్తుతాయని అన్నారు.
రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇరు ప్రాంతాల్లో పోలీసుల సంఖ్య తగ్గిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సీఎం తెలిపారు. దీంతో, మతతత్వ శక్తులు, నక్సలైట్లు రెచ్చిపోతారని అభప్రాయపడ్డారు. దేశానికున్న అతి పెద్ద సమస్యల్లో నక్సలిజం కూడా ఒకటని సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన్మోహన్ చెప్పారని గుర్తుచేశారు.