: విభజనతో నదులను కూడా విభజించుకోవాల్సి వస్తుంది... సీఎం కిరణ్


విభజనతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని సీఎం కిరణ్ తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ట్రైబ్యునల్స్ ఉన్నా కృష్ణా, గోదావరి మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రలు వాడుకుంటున్నాయని జీవోఎంకు చెప్పినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మిగులు జలాల లభ్యత మేరకు ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టామని చెప్పారు. శ్రీశైలం కింద 74 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే పులిచింతల కూడా పూర్తికాబోతోందని సీఎం అన్నారు.

కృష్ణా డెల్టాలో నాగార్జునసాగర్ కింద ఆంధ్రలో 30 లక్షల ఎకరాలు, తెలంగాణలో 20 లక్షల ఎకరాలు సాగవుతోందని సీఎం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే నదీ జలాలను సమన్వయంతో వాడుకునే వీలుంటుందని తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య నీటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఎలాంటి బోర్డులు కూడా లేవని గుర్తుచేశారు. మిగుల జలాల సమస్య తలెత్తుతుందని చెప్పారు. కృష్ణా నదిని రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సీఎం చెప్పారు.

  • Loading...

More Telugu News