: రాష్ట్రంలో కొత్తగా 122 న్యాయస్థానాలు: మంత్రివర్గం నిర్ణయం


దేశంలో కోట్లాది కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్తగా 122 న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అంతేగాకుండా, 36 రెగ్యులర్ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రివర్గం.. పది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3599 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 2600 పోస్టులు భర్తీ చేయనున్నారు.

న్యాయవిభాగంలో మరో 89 పోస్టులకు నియామకాలు జరుపనున్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో 9 సవరణలు చేయాలని భావిస్తున్నారు. 25 ఏళ్లకు పైబడిన లీజులు సమీక్షించేందుకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. అయితే సీఎం లీజు వ్యవహారంపై ఉపసంఘం వేద్దామని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News