: ఈ రోజు రాత్రి ముంబైలో సచిన్ భారీ పార్టీ
క్రికెట్ కు వీడ్కోలు పలికిన రెండు రోజుల తర్వాత... ఈ రోజు రాత్రి సచిన్ భారీ పార్టీ ఇస్తున్నారు. ముంబైలోని తూర్పు అంధేరీలో ఉన్న 'వాటర్ స్టోన్ క్లబ్'లో ఈ బిగ్ బాష్ జరగనుంది. ఈ పార్టీకి వెయ్యి మంది అతిథులు హాజరుకానున్నారు. వీరిలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఇషాంత్ శర్మ, చటేశ్వర్ పుజారా మినహా టీం ఇండియా ఆటగాళ్లందరూ ఈ పార్టీలో సందడి చేయనున్నారు. వారితో పాటు శారదాశ్రమ్ విద్యామందిర్ లో సచిన్ తో పాటు చదివిన స్కూల్ మేట్స్ కూడా హాజరుకానున్నారు. ఆహూతులందరికీ సచిన్ శ్రీమతి అంజలి వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు పంపించారు.