: అశోక్ బాబు సీమాంధ్ర అభివృద్ధి కోరుకోవాలి : హరీష్ రావు
అశోక్ బాబు కారుకూతలు మాని సీమాంధ్ర అభివృద్ధి కోరుకోవాలని తెరాస నేత హరీష్ రావు సూచించారు. ప్రస్తుత పరిస్థుతుల్లో ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగదని అన్నారు. విభజన అనివార్యమని సీమాంధ్ర కేంద్ర మంత్రులే నమ్మారని తెలిపారు. భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని... ఈ ప్రాంతాలను తెలంగాణ నుంచి వేరుచేయలేరని చెప్పారు. ఎంత మంది కోర్టుకు వెళ్లినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగే పరిస్థితి లేదని హరీష్ అన్నారు.