: చంద్రబాబుకు కుప్పంలో ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం చేరుకున్నారు. బెంగళూరు నుంచి నేరుగా శాంతిపురం మండలం సిద్ధావూరుకు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిద్ధావూరులో 'ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం'లో భాగంగా ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం శాంతిపురం, రామకుప్పంలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.