: గూగుల్లో ఇక చిన్నారుల బూతు చిత్రాలు కనిపించవ్!
చిన్నారుల అశ్లీల, శృంగార చిత్రాలపై గూగుల్ వేటు వేస్తోంది. అలాంటి సభ్య సమాజ వ్యతిరేక ఫొటోలు సెర్చింజన్ లో ఎంత శోధించినా కనిపించకుండా ఉండేందుకు ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు గూగుల్ అధినేత ఎరిక్ స్మిత్ తెలిపారు. లక్షకు పైగా మార్గాల్లో ఈ ఫోటోల కోసం శోధించినా కనిపించకుండా టెక్నాలజీ అడ్డేస్తుందని చెప్పారు. ముందుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో దీన్ని అమలు చేస్తామని, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషలు మాట్లాడే 158 దేశాల్లో ఆరు నెలల్లోపు అమల్లోకి తీసుకువస్తామని స్మిత్ వెల్లడించారు.