: విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలి: కిశోర్ చంద్రదేవ్
విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేయాలని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ జీవోఎంకు సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణానికి రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోకి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని... అందువల్ల దానికి కొంత లబ్ధి చేకూర్చాలని ఆయన సూచించారు. 1953లో జస్టిస్ వాంఛూ కమిషన్ కూడా విశాఖను రాజధానిని చేయాలని సూచించిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం 9 వేల ఎకారలను ఇప్పటికే సేకరించారని, మరో 18 వేల ఎకరాలు ఉంటే పరిపాలనా భవనాలు నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని అవసరం లేదని తక్షణం ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.