: భారత కంటెంట్ ఎక్కువగా ప్రసారం చేస్తున్న చానళ్లపై పాక్ జరిమానా
భారత కంటెంట్ ను అధికంగా ప్రసారం చేస్తున్న 10 వినోదాత్మక చానళ్లపై పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ మండలి కోటి రూపాయల జరిమానా విధించింది. హమ్ టీవీ, ఆక్సీజన్, ప్లే, కోహినూర్, టీవీ ఒన్, ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్, జీఎక్స్ఎమ్, జ్వాలా తదితర చానళ్లు వీటిలో ఉన్నాయి. ఈ చానళ్లు అనుమతించిన పరిమితి కంటే అధికంగా భారత్ సహా, విదేశీ కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది.