: వాజ్ పేయికీ భారతరత్న ఇవ్వాలి: ఫరూక్ అబ్దుల్లా
మాజీ ప్రధాని వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలన్న బీజేపీ డిమాండ్ కు కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా స్వరం కలిపారు. ఒక భారతీయుడిగా వాజ్ పేయి గొప్ప నేత అనే విషయాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు. వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తన్నట్లు తెలిపారు. ఏదో ఒకరోజు వాజ్ పేయి దేశ ప్రధాని అవుతారని నెహ్రూ ఆనాడే చెప్పారని అబ్దుల్లా వెల్లడించారు. వాజ్ పేయికి భారతరత్న ఎందుకివ్వలేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నిన్న కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.