: జీవోఎంతో భేటీ అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
జీవోఎంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. విభజనపై జీవోఎంకు తన వాదనలు వినిపించేందుకు సీఎం పూర్తిగా సన్నద్ధమయ్యారు. నార్త్ బ్లాక్ కు చేరుకునే ముందు ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. సమైక్యంగా ఉంచాలని లేని పక్షంలో ఏ రకంగా విభజనను చేపట్టాలనే దానిపై ఆయన జీవోఎంకు పలు సూచనలు చేస్తున్నట్టు సమాచారం.