: భారత్ లో విదేశీ రచయితల సత్తా


రచనలు ఖండాంతరాలు దాటి పాఠకుల ఆదరణను చూరగొంటున్నాయి. యూరోప్, అమెరికా రచయితలు ఇప్పుడు భారత్ లో తమ రచనల సత్తా చూపుతున్నారు. ఇటీవల కెనడియన్ రచయిత మెర్లేన్ హెమ్స్ ట్రాట్ 'పీకాక్స్ అమాంగ్ ద టామరిండ్ ట్రీస్' పేరుతో కెనడా, భారత వైద్యుల మధ్య ప్రేమ కథను రచనగా మలిచారు. ఈ ధోరణిపై సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ బాబ్ మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున భారతీయ పాఠకులను దృష్టిలో ఉంచుకుని విదేశీ రచయితలు ఇక్కడకు వస్తున్నట్లు వివరించారు. భారతీయ రచయితలు విదేశాలలో తమ సత్తా చూపుతుంటే.. ఇప్పుడు విదేశీ రచయితలు భారత పాఠకుల ఆదరణ కోరుకుంటున్నారని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News