: సమైక్య స్పూర్తికి విరుద్ధంగా విభజన: సుప్రీంలో నారీమన్


విభజన అంశంలో సుప్రీంకోర్టులో వేడిగా వాడిగా వాదనలు కొనసాగుతున్నాయి. సమైక్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుందని ప్రముఖ న్యాయవాది నారీమన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని అయన కోర్టుకు తెలిపారు. ఆర్టికల్ 3 ఉధ్దేశాన్ని నారీమన్ న్యాయమూర్తులకు సవివరంగా తెలిపారు. విభజనపై అసెంబ్లీ ఆమోదం కావాలని గతంలో న్యాయమూర్తి స్పష్టం చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

నారీమన్ వాదనల తరువాత హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఆమోదం తెలుసుకోకుండానే విభజనకు కేంద్రం పావులు కదుపుతోందని ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. విభజనకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన తరువాత కేంద్రాన్ని కోరాలని... అలాంటి పక్షంలోనే రాష్ట్ర విభజన జరగాలని, గతంలో అన్ని రాష్ట్రాలు ఇలానే ఏర్పాటయ్యాయని ఆయన సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించిందన్న కారణంతోనే కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు.

దీంతో స్పందించిన న్యాయమూర్తులు గతంలో ప్రీమెచ్యూర్డ్ స్టేజ్ లో ఉన్నందున పిటిషన్లను తిరస్కరించామని, ప్రస్తుతం అలా కాదని వాదనలు వింటామని న్యాయమూర్తులు తెలిపారు. తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిటిషనర్లకు తెలిపారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తులు విచారణను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News