: రచ్చబండను అడ్డుకునేందుకు యత్నించిన తెదేపా నేతల అరెస్ట్


కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెదేపా నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, రచ్చబండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News