: సోనియాకు రూ. 10కోట్ల పరువు నష్టం నోటీసు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పరువు నష్టం నోటీసు పంపించారు. ఆమెతోపాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు నోటీసులు పంపిస్తూ 10కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలని కోరారు. శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పత్రికా ప్రకటన నేపథ్యంలో ఈ నోటీసు జారీ అయింది. అత్యాశగల కుటుంబం మద్యప్రదేశ్ ను దోచేసిందంటూ శివరాజ్ సింగ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పత్రికా ప్రకటన ఇచ్చింది.