: ముంబయి-ఢిల్లీ మార్గంలో పూర్తి ఏసీ రైలు
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ముంబయి నుంచి ఢిల్లీకి పూర్తిగా ఏసీ కోచ్ లతో ఓ రైలును నడుపుతామని సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సుభోధ్ జైన్ తెలిపారు. వారానికి ఒక్కసారి మాత్రమే నడిచే ఈ రైలు భోపాల్ మీదుగా వెళుతుంది.
ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ రైలును నడుపుతున్నామని జైన్ వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఎల్ఎల్ హెచ్ బోగీలను ఈ రైలుకు వినియోగిస్తారు. ఇప్పటివరకు ఎల్ఎల్ హెచ్ బోగీలు రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లకు మాత్రమే వాడుతున్నారు