: అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరు


అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల అక్రమాలకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, శ్యాంబాబు, మురళీధర్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. ఇదే కేసులో మంత్రి గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరు కావాల్సి ఉన్నా.. గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని ధర్మాన తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశారు. అలాగే, నేడు ఢిల్లీలో జీవోఎం సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున గీతారెడ్డి విచారణకు రాలేదు.

  • Loading...

More Telugu News