: హైదరాబాద్ చేరుకున్న జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీల మద్దతు కూటగట్టేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీపీఐ, సీపీఎం, బీజేపీ అగ్రనేతలతో జగన్ భేటీ అయి, ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచేందుకు సహకారం అందించాలని కోరారు. మరోవైపు ఈ రోజు హైదరాబాద్ లో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.