: ఢిల్లీలో భేటీ అయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు


విభజనపై కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుండటంతో... హస్తినలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర మంత్రి పళ్లంరాజు నివాసంలో భేటీ అయ్యారు. జీవోఎం ఎదుట వినిపించాల్సిన వాదనలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, చిరంజీవి, జేడీ శీలం, కావూరి, పనబాక, పురంధేశ్వరి, కిల్లి కృపారాణితో పాటు ఎంపీలు హర్షకుమార్, లగడపాటి, కేవీపీ, రాయపాటి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News