: నేడు వైకాపా విస్తృతస్థాయి సమావేశం


జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి వైకాపా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ రోజు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కన్వీనర్లు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఓ కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. సమైక్య ఉద్యమంలో మరింత కీలక పాత్ర పోషించేలా పార్టీని సన్నద్ధం చేసే దిశగా ఈ సమావేశం జరగనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో, నియోజక వర్గాల అభ్యర్థుల్ని ఎంపిక చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News