: నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు, రేపు తన సొంత నియోజక వర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం బెంగళూరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకుంటారు.