: రష్యాలో ఘోర విమాన ప్రమాదం: 50 మంది మృతి
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 50 మంది మృతి చెందారు. మాస్కో నుంచి వస్తున్న బోయింగ్ -737 విమానం కాజన్ లోని వోల్గాసిటీ విమానాశ్రయంలో రన్ వే ను ఢీకొట్టడంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్ప కూలింది. దీంతో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 50 మంది మృతి చెందారు.