: టూ ఇన్ వన్ కళ్లజోడు
ఇదో కొత్త రకం కళ్ళజోడు. ఎండ నుండి మన కళ్లను రక్షించడంతోబాటు మన సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్ కూడా చేస్తుందిది. ఇలాంటి సరికొత్త కళ్లజోడును భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రూపొందించాడు.
ఎండ వేడినుండి కళ్లను రక్షించుకునేందుకు మనం ఎక్కువగా కూలింగ్ గ్లాసులను వాడుతుంటాం. ఇవే కూలింగ్ గ్లాసులతో మన సెల్‌ఫోన్‌ను కూడా ఛార్జింగ్ చేసుకునే విధంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని మియామీ యాడ్ స్కూల్లో సయాలీ కలుస్కర్ అనే విద్యార్ధి తయారుచేశాడు. ఇందుకోసం కూలింగ్ గ్లాస్ ఫ్రేమ్‌లపై రెండు చిన్న సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఈ ప్యానెళ్లు సౌరశక్తి ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ కళ్లజోడుకు మన మొబైల్‌ను అనుసంధానిస్తే దానిలో ఉత్పత్తి అయ్యే కరెంటుతో చక్కగా మన ఫోను ఛార్జ్ అవుతుంది. మొత్తానికి ఈ కళ్లజోడు మన కళ్లకు చల్లదనాన్ని, ఫోనుకు కరెంటును ఇస్తుందన్నమాట.