: చూయింగ్‌ గమ్‌తో మెమరీ పెరుగుతుందట!


చూయింగ్‌ గమ్‌ను నమలడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చని, అలాగే దవడలకు మంచి వ్యాయామంలాగా పనిచేస్తుందని పలువురు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ఫ్లేవర్లలో లభించే చూయింగ్‌ గమ్‌లను నమలడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆకుకూరలు కూడా మన మెమరీని పెంచడంలో చాలా బాగా తోడ్పడతాయని, మతిమరుపును నిరోధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

పుదీన వంటి కొన్ని రకాల ఆకుకూరలు వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నిరోధించగలిగిన శక్తిని కలిగివుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలో ఉండే విటమిన్‌ సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల వీటితో తయారయ్యే చూయింగ్‌ గమ్‌లను నమలడం వల్ల మెమరీ మెరుగవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సెయింట్‌ లూయిస్‌ వర్సిటీకి చెందిన వృద్ధాప్య చికిత్స నిపుణుడు ప్రొఫెసర్‌ సుశాన్‌ ఫార్‌ మాట్లాడుతూ పుదీన వంటి వాటితో తయారయ్యే చూయింగ్‌ గమ్‌లను నమలడం వల్ల ఒత్తిడి అదుపులోకి వచ్చి, మెదడు పనితీరు మెరుగవుతుందని, కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరిగి, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఎలుకలపై చేపట్టిన ప్రాథమిక పరీక్షలు విజయవంతమయ్యాయని ఫార్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News