: అశోక్ బాబుపై కేసు నమోదు చేయండి ... టీ న్యాయవాదులు


రాష్ట్ర విభజన అంశంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీ న్యాయవాదుల ఐకాసా నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

గుడి మల్కాపూర్ లో నిర్వహించిన సభలో పది లక్షల మందితో హైదరాబాదును ముట్టడిస్తామని అశోక్ బాబు, తెలంగాణ ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాదులో అల్లర్లు సృష్టించేందుకు అశోక్ బాబు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. తక్షణమే వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News