: ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష
ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం వచ్చే నెల 6 నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు విదర్భ సంయుక్త కార్యాచరణ సంఘం సమన్వయకర్త ఆశిష్ దేశ్ ముఖ్ ప్రకటించారు. తెలంగాణతో పాటు విదర్భనూ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేకుంటే భవిష్యత్ లో కూడా విదర్భ రాష్ట్రాన్ని సాధించలేమని ఆయన తెలిపారు. తెలంగాణ, విదర్భ రెండు రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని 1956లోనే సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.