: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశమున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం మరింత బలహీనపడి ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, తెలంగాణ, ఉత్తరకోస్తాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.