: కాంగ్రెస్ కుటిల నీతిని బయటపెడతాం : గాలి ముద్దుకృష్ణమ
వైకాపా, తెరాసలతో కలసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు, కుయుక్తులను ప్రజల ముందుంచేందుకు తమ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రలు ఉపయోగపడతాయని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఈ నెల 21న తిరుపతి నుంచి బాబు మొదటి దశ యాత్ర మొదలవుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని గాలి విమర్శించారు.