: సచిన్ రిటైర్మెంటు తర్వాతి రోజు ఎలా గడచిందంటే...
ఈ రోజు ఉదయాన్నే 6.50 కి నిద్రలేచానని... ఇక ప్రాక్టీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకున్నానని సచిన్ తెలిపారు. ఇకపై తన శరీరం ఆదేశించినట్టు నడచుకోవచ్చని అనుకున్నట్టు చెప్పారు. అనంతరం తానే కాఫీ చేసుకున్నానని తెలిపారు. తర్వాత తన భార్యతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశానని చెప్పారు. ఈ ఉదయం ఎంతో రిలాక్స్ డ్ గా ఫీలయ్యానని తెలిపారు. ఎన్నో శుభాకాంక్షలను అందుకున్నానని సచిన్ అన్నారు.