: పిచ్ ను తాకినప్పుడు ఉద్వేగానికి లోనయ్యా : సచిన్
22 గజాల క్రికెట్ పిచ్ తనకు దేవాలయమని సచిన్ అన్నారు. పిచ్ మీద తాను గడపడం వల్లే ఇదంతా సాధించానని... ఇంత స్థాయికి ఎదిగానని తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఉద్వేగానికి గురికాలేదని... తన సహచరులు వీడ్కోలు పలుకుతున్నప్పుడు, తాను పిచ్ తో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు. చివరిసారి బ్యాటింగ్ కు దిగుతున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. ఆట తర్వాత కన్నీళ్లపర్యంతం అయ్యాయని... తోటి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేక తల వంచుకుని భారంగా కదిలానని వెల్లడించారు.