: క్రికెట్టే నాకు ఆక్సిజన్ : సచిన్
భారత్ కు 24 ఏళ్ల పాటు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని భారతరత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. తన 24 ఏళ్ల క్రికెట్ లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. తన 40 ఏళ్లలో 30 ఏళ్లు క్రికెట్ తోనే గడచిపోయాయని చెప్పారు. ఈ రోజు ఆయన ముంబయ్ లో పత్రికా సమావేశంలో మాట్లాడారు. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించానని తెలిపారు. క్రికెట్ తన ప్రాణం, తన శ్వాసని చెప్పారు. ఆటలో భాగంగా తనకు ఎన్నో సార్లు గాయాలయ్యాయని... తిరిగి ఫిట్ నెస్ సాధించడం చాలా కష్టమైందని వెల్లడించారు. ఇకముందు కూడా క్రికెట్ తో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ఇండియా తరపున ఇకపై తాను శారీరకంగా క్రికెట్ ఆడకున్నా... మానసికంగా ఆడుతుంటానని సచిన్ తెలిపారు.