: పార్లమెంటులో ఆంగ్లం మాట్లాడకూడదు: ములాయం
పార్లమెంటులో ఎంపీలు ఆంగ్లం మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. పార్లమెంటులో ఆంగ్లభాషను బహిష్కరించాలన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడే దేశాలే అభివృద్ధి చెందాయని తెలిపారు. మన జాతీయ భాష హిందీని ప్రోత్సహించడం అవసరం అని ఆయన పేర్కొన్నారు. భాష విషయంలో నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ములాయం విమర్శించారు. ఓటు కోసం ప్రజలవద్దకు వచ్చినప్పుడు హిందీలో అడుగుతారని, చట్టసభలకెళ్లి ప్రజలకు అర్ధం కాని ఆంగ్ల భాషలో మాట్లాడుతారని అన్నారు.