: విజయనగరం జిల్లాలో రైలు ఢీకొని ముగ్గురు మృతి
విజయనగరం జిల్లా నెల్లిమెర్ల మండలంలో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. బాలాజీ సింగ్ (40) అనే వ్యక్తి, అతని కుమారులు పురుషోత్తమ్ (8), అనిల్ (4) లు చంపాతీ నదిని సందర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూత్ర విసర్జనకు వెళ్లి రైల్వే ట్రాక్ దాటుతుండగా... ముంబై నుంచి భునేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వీరు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.