: 2013 ప్రపంచ అథ్లెట్ అవార్డును కైవసం చేసుకున్న ఉసేన్ బోల్ట్
జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 2013 ప్రపంచ అత్యున్నత అథ్లెట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళా విభాగంలో షెల్లీ-ఆన్ ఫ్రేజర్-ప్రైస్ అత్యుత్తమ మహిళా అథ్లెట్ అవార్డుని కైవసం చేసుకుంది. మాస్కోలో గత ఆగస్టులో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4X100 రిలే పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి... కెరీర్ లో మొత్తం 8 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించిన అథ్లెట్ గా రికార్డులకెక్కారు. అలాగే, ఒలింపిక్స్ లో బోల్ట్ ఇప్పటిదాకా 6 స్వర్ణ పతకాలు సాధించాడు. అంతేకాకుండా, 100, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
ఇక ఫ్రేజర్ విషయానికొస్తే, మాస్కో లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మూడు విభాగాల్లో (100 మీటర్లు, 200 మీటర్లు, 4X100 రిలే) స్వర్ణాలు సాధించింది. అత్యుత్తమ అవార్డులు సాధించిన వీరిద్దరికీ లక్ష అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ అందింది.