: పాక్ లో రానున్న రోజులు భయానకమే: తాలిబాన్ హెచ్చరిక
రానున్న రోజుల్లో బీభత్సం సృష్టిస్తామని తాలిబాన్లు పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ నేత హకీముల్లా మెహసూద్ ను డ్రోన్ దాడుల్లో అంతమొందించేందుకు అమెరికాకు సహకరించిన పాక్ ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శనివారం బన్నులో మిలటరీ అధికారులపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిని ఇందుకు ప్రారంభంగా పేర్కొన్నారు.