: ఏ అంశంపైనా కేంద్రానికి స్పష్టత లేదు : అశోక్ బాబు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. కేవలం మాటిచ్చామనే ఉద్దేశంతోనే విభజనపై కేంద్రం ముందుకెళ్తోందే తప్ప... ఏ అంశంపైనా కేంద్రానికి స్పష్టత లేదని విమర్శించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారి భరతం పడతామని హెచ్చరించారు. హైదరాబాద్, భద్రాచలంలలో రాజకీయ రౌడీయిజం జరుగుతోందని అన్నారు. 2014 ఎన్నికలపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయం అందరూ గుర్తించాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమించాలని కోరారు.