: సచిన్ కు సమాజ్ వాదీ పార్టీ ఆహ్వానం
క్రికెట్ నుంచి నిష్క్రమించిన సచిన్ టెండుల్కర్ కు సమాజ్ వాదీ పార్టీ ఆహ్వానం పలికింది. సచిన్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమ పార్టీలో చేరాలని ఎస్పీ నేత, ఉత్తరప్రదేశ్ క్రీడా మంత్రి నరద్ రాయ్ ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ వాడుకుని వదిలేస్తాయని, వాటితో జాగ్రత్త అంటూ సూచించారు. సచిన్ కు భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతించారు.