: మా రాముడిని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు : టీ.కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలోని జైపాల్ రెడ్డి నివాసంలో టీకాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ... భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. భద్రాచలం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. తమ రామయ్యను, గిరిజన సంస్కృతిని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసన్నారు. ముంపు లేకుండా పోలవరం నిర్మించుకుంటే సమస్యే ఉండదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వరకే ఉమ్మడి రాజధానిని పరిమితం చేయాలని బలరాంనాయక్ చెప్పారు. దీనికితోడు, 1953కు ముందు భద్రాచలం తెలంగాణలోనే ఉందని తెలిపారు. కేవలం మూడేళ్లు మాత్రమే భద్రాచలం ఆంధ్రా ప్రాంతంలో ఉందని నాయక్ అన్నారు.