: బీజేపీతో పొత్తు కోసమే జగన్ ఢిల్లీ యాత్ర : ఎంపీ గుత్తా
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని... అందుకే ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎనిమిది ఉండగా... తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండుంటే సమస్యేంటని జగన్ ను ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతంలో సీఎం పీఠం కోసమే కిరణ్, జగన్ ఇద్దరూ సమైక్యవాదం వినిపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని కిరణ్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని గుత్తా విమర్శించారు.