: ముస్లింలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలి: జైరాం రమేశ్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైరాంరమేశ్ అన్నారు. ఢిల్లీలో ఊర్దూ మీడియా విలేకరులతో ముఖాముఖి సందర్భంగా జైరాం రమేశ్ ఈ విధంగా అన్నారు. ఏ మతాన్నీ దూషించాలనేది రాహుల్ ఉద్దేశం కాదని జైరాం చెప్పారు.అయినప్పటికీ, రాహుల్ ముస్లింలకు సారీ చెప్పాలని మంత్రి అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్.. ముజఫర్ నగర్ అల్లర్ల బాధిత ముస్లిం యువకులను ఐఎస్ఐ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై జైరాం స్పందిస్తూ.. రాహుల్ వ్యాఖ్యలను మీడియా, కాంగ్రెస్ వ్యతిరేకులు పక్కదోవ పట్టించారని చెప్పారు.