: ఇద్దరు విండీస్ బౌలర్లపై అంపైర్ల ఫిర్యాదు


వెస్టిండీస్ బౌలర్లు శామ్యూల్స్, షిల్లింగ్ఫోర్డ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. భారత్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచులో వీరి బౌలింగ్ తీరుపై ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్లు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో బౌలింగ్ యాక్షన్ పై 21 రోజుల్లోగా వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేయాలని ఐసీసీ ఇద్దరు విండీస్ బౌలర్లను కోరింది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలితే వీరిపై ఐసీసీ చర్యలు తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News