: అనివార్య పరిస్థితుల్లో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి : జేసీ
తాను ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడిపత్రిలోని చారిత్రక బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం తమ ప్రాంత ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ డిమాండ్ ను తెరమీదకు తెచ్చినట్టు జేసీ అన్నారు. తన జిల్లా, తన ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని ఆయన తెలిపారు.